నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ఖండేబల్లూర్ గ్రామము పక్కనే ఉన్న పర్వతంపై అతి పురాతనమైన వందల ఏండ్ల క్రితం నాటి బాలాజీ టెంపుల్ ను పూర్వీకులు నిర్మించారు. ఆపదమొక్కులవాడు, వెంకటేశ్వరుడిని దర్శనం చేసుకున్న వారికి కొంగు బంగారమై నిలుస్తాడు. భక్తుల కోరికలు నెరవేరుస్తూడని ఇక్కడి ప్రాంత వాసుల ప్రగాఢ నమ్మకం. గ్రామ ప్రజలకు రైతులకు వెంకటేశ్వరుని కొలిచే భక్తులందరికి సుఖ: సంతోషాలతో వెళ్లే భక్తులకు నీటీ సదుపాయం లేక పలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన యూత్ సభ్యుడు కొమ్ము శ్రీనివాస్, గ్రామ యువకులు కలిసి టెంపుల్ వద్ద భక్తులకు నీటి వసతులు కల్పించాలని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి డబ్బులు పోగు చేసి శనివారం గ్రామ పెద్దలతో కలిసి, వారి సహకారంతో నీటి సదుపాయాన్ని కల్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతుగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బాలాజీ టెంపుల్ వద్ద నీటి వసతి కల్పించిన గ్రామ యువత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES