Friday, May 9, 2025
Homeరాష్ట్రీయంఅర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సిందే

అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సిందే

- Advertisement -

– ప్రభుత్వ భూముల్లోకి పేదలను తీసుకెళ్తాం..
– ప్రభుత్వాలు మారినా ప్రజల జీవితాల్లో మార్పు లేదు
– ప్రజాపాలనంటున్న రేవంత్‌ సర్కారులో ప్రజా సమస్యల పరిష్కారమేది..? : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు
– ఇండ్ల స్థలాల కోసం పేదలతో దరఖాస్తులు పెట్టిస్తాం.. పరిశీలించి పరిష్కరించండి : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు
– పార్టీ జిల్లా కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన, ధర్నా
నవతెలంగాణ-సంగారెడ్డి

అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సిందేనని, ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూముల్లోకి పేదలను తీసుకెళ్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. గురువారం సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని ఆపార్టీ జిల్లా కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ప్రద ర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి, పలు డిమాండ్లతో కూడిన విన తిపత్రాన్ని డీఆర్వోకు అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. అనేక ఏండ్లుగా పేదలు ఇండ్ల స్థలాల కోసం ఎదురు చూస్తు న్నారన్నారు. రాష్ట్రంలో పాలకులు మారినా ప్రజల బతుకులు మారడం లేదన్నారు. పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వకుంటే ప్రభుత్వ స్థలాల్లో ఎర్రజెండాలు పాతి పేదలకు ఆ భూములను పంచుతామని స్పష్టంచేశారు. ప్రజా పాలన అంటున్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్క ప్రజా సమస్య ను కూడా పరిష్కారం చేయ కుండా నిర్లక్ష్యం చేస్తుందని తెలి పారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ అందాల పోటీలే ముఖ్యమైనట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా ఏ ఒక్క సంక్షేమ పథకం పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేని అనేక మంది పేదలు ఇండ్ల స్థలాల కోసం సంగారెడ్డి, కంది, సదాశివపేట, జహీరా బాద్‌, పటాన్‌చెరులో తాత్కాలిక గుడిసెలు నిర్మించుకున్నారని, వాటిని ప్రభుత్వ అధికారులు కూల్చేశారని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి వారికి తక్షణమే ఇండ్ల పట్టాలతో పాటు గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే జిల్లా వ్యాప్తంగా ఇండ్ల స్థలాల కోసం పోరాడుతున్న పేదలందరినీ కలుపు కొని రానున్న రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ.. ఇండ్ల స్థలాల సమస్యపై సీపీఐ(ఎం) నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. అధికారులు ఇండ్ల స్థలాల కోసం దరఖాస్తులు పెట్టుకున్న పేదలందరికీ పట్టాలిచ్చి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని తెలిపారు. రాజీవ్‌ గృహకల్ప లబ్దిదారులకు ఇండ్లు పూర్తి చేసి అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, రాజయ్య, మాణిక్‌, సాయిలు, నర్సింలు, నాయకులు యాదగిరి, ప్రవీణ్‌, నాగేశ్వర్‌రావు, కృష్ణ, అశోక్‌, రాజయ్య, శ్రీనివాస్‌, రమేష్‌ గౌడ్‌, సలీం, రాజేష్‌, మహేష్‌, అర్జున్‌, వివిధ ప్రాంతాల నుంచి పేదలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -