– సీపీఐ(ఎం) హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు గుగులోతు శివరాజ్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులు పంట నమోదు ప్రక్రియ చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని సీపీఐ(ఎం) హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు గుగులోతు శివరాజ్ అన్నారు. శనివారం హుస్నాబాద్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వరి, పత్తి, మొక్కజొన్న, తదితర అరుతడి పంటలను రైతులు అమ్ముకోవడానికి సివిల్ సప్లై, మార్క్ ఫెడ్, సీసీఐలో కొనుగోలు చేయడానికి పంట నమోదు అవసరమన్నారు.
పంట నమోదు చేయకపోవడం వల్ల రైతులు పండించిన పంటలను అమ్ముకోవడానికి మార్కెట్ కు, సిసిఐ కు వస్తే పంట నమోదు ఉందా లేదా చూసి కొనుగోలు చేస్తారన్నారు. అలాంటప్పుడు రైతులు ఏఈఓ ఎవోలో చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. గతంలో అధికారులు గ్రామ పంచాయతీల వద్ద కూర్చుని ఏదో ఒక పంట నమోదు చేసి చేతులు దులుపుకున్నారన్నారు. గత సంవత్సరంలా కాకుండా క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు పంటల నమోదు చేయాలని అన్నారు.
ఈ పంట ఎంత సాగు చేస్తున్నారో పంటల నమోదు కాక యూరియా బస్తాల కోసం రోజుల తరబడి క్యూ లైన్ లో ఉండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి జిల్లా వ్యవసాయ శాఖ అధికార యంత్రాంగానికి పంట నమోదు ప్రక్రియ చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు లేనియెడల వ్యవసాయ శాఖ ఏడి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) నాయకులు రాజు నాయక్, వినోద్ రావు, నవీన్, హరీష్, శ్రీయాన్స్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.