Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గాంధీజీలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

గాంధీజీలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

- Advertisement -

ఆటపాటలతో ఆకట్టుకున్న చిన్నారులు
సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ
ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్. కోడి శ్రీనివాసులు 
నవతెలంగాణ  – చండూర్ 

దసరా సెలవులు ప్రారంభం కానున్న దృష్ట్యా ముందస్తు బతుకమ్మ సంబరాలను స్థానిక గాంధీజీ విద్యాసంస్థల్లో  శనివారం ఘనంగా జరుపుకున్నారు. ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు గౌరీదేవికి పూలమాలలు వేసి పూజ చేసి బతుకమ్మ వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడి శ్రీనివాసులు  మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి,  సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, ఈ పండుగను తెలంగాణ ఆడపడుచులు వారి పుట్టింటిలో ఘనంగా జరుపుకుంటారని అన్నారు.

ప్రకృతిని ఆరాధిస్తూ… బంధాలు  అనుబంధాలను గుర్తు చేసుకుంటూ…. ఆడపడుచులు తొమ్మిది రోజులపాటు పూలతో గౌరీదేవిని పూజిస్తారని, మహాలయ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమై చివరి రోజు సద్దుల బతుకమ్మగా ముగుస్తుందని తెలిపారు. విద్యార్థినులు మహిళా ఉపాధ్యాయులు సాంప్రదాయ వస్త్రధారణతో, పూలతో అలంకరించుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రంగురంగుల బతుకమ్మలతో పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని ఆదరించే ఆచారానికి ప్రతీక అని పేర్కొన్నారు. సత్యం చెడుపై గెలిచే విజయదశమి సందేశం చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్  సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్స్ భార్గవ్, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -