Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు ఐఎస్ఆర్ఓ సందర్శన పరీక్ష

విద్యార్థులకు ఐఎస్ఆర్ఓ సందర్శన పరీక్ష

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు మండలంలో ప్రభుత్వ, రెసిడెన్షియల్, కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు ఐ ఎస్ ఆర్ ఓ సందర్శన కొరకు జిల్లా కేంద్రంలో పరీక్ష నిర్వహించి 30 మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓ రాజ గంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు జిల్లా స్థాయిలో పరీక్ష నిర్వహించి ఎంపిక చేయబడుతుందని ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ లో ఆన్ లైన్ లలో నిర్వహించబడుతుందన్నారు. పాఠశాలల పునః ప్రారంభం తర్వాత ఈ పరీక్ష జిల్లా హెడ్ క్వార్టర్ లో నిర్వహించబడుతుంది. ఈ పరీక్షలో స్పేస్ మరియు ఇస్రో కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఇట్టి సమాచారాన్ని మీ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిలకు సమాచారం అందించి ఈ దసరా సెలవులలో విద్యార్థులు ఇట్టి పరీక్ష కొరకు సంసిద్ధులు కావాలన్నారు. వివరాల కొరకు జిల్లా సైన్స్ అధికారి శ్రీ ఎం. సిద్దిరాం రెడ్డిని సంప్రదించగలరని సూచించారు. (9440414250)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -