- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన 300 మంది వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం సాయిలు మాట్లాడుతూ మహిళా సంఘాలలో ఉన్న మహిళలకు చదవడం, రాయడం రాని మహిళలకు చదవడం రాసే విధంగా శిక్షణ ఏ విధంగా ఇవ్వాలో వాలంటీర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే డిఫాల్ట్ ఉన్న మహిళా సంఘాలను గుర్తించి శిక్షణ ఇచ్చి సంఘాలను పునరుద్ధరణ బ్యాంక్ మేనేజర్ సమక్షంలో చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీసీలు స్వాతి, రమేష్, వివోఏలు, బ్యాంకు మేనేజర్, సిబ్బంది, మహిళా సంఘం సభ్యులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -