Saturday, September 20, 2025
E-PAPER
Homeజాతీయంజ‌మ్ములో హై అల‌ర్ట్

జ‌మ్ములో హై అల‌ర్ట్

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌:
జ‌మ్ముక‌శ్మీర్‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు హై అల‌ర్ట్ ప్ర‌క‌టించాయి. ముఖ్యంగా జ‌మ్మూ-శ్రీ‌న‌గ‌ర్ హైవేపై భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. అద‌న‌పు బ‌ల‌గాల‌ను మోహ‌రించి నిఘా పెంచారు. ఉధంపూర్ జిల్లాలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలకు ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ఎదురు కాల్పుల్లో జైషే మొహమ్మద్‌కు చెందిన ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపిన‌ట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. త‌ప్పించుకున్న ఉగ్ర‌వాదుల కోసం డోన్ల ద్వారా అన్వేష‌ణ సాగించామని, వారి కోసం తీవ్రంగా గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయ‌ని ఆర్మీ వ‌ర్గాలు తెలిపాయి. ఈ ఎన్ కౌంట‌ర్‌తో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అప్ర‌మ‌త్త‌మైయ్యాయి. జమ్ముకశ్మీర్ పోలీసుల కౌంటర్-ఇంటెలిజెన్స్ విభాగం ఆధ్వ‌ర్యంలో కశ్మీర్ లోయలోని శ్రీనగర్, బారాముల్లా, అనంత్‌నాగ్, కుప్వారా, హంద్వారా, పుల్వామా, షోపియన్‌లలో ఉగ్రవాదుల ఆచూకీ కోసం తనిఖీలు నిర్వహించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -