Friday, May 9, 2025
Homeజాతీయంబీజాపూర్‌లో ఎన్‌కౌంటర్‌

బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్‌

- Advertisement -

– 8మంది మావోయిస్టులు మృతి
బీజాపూర్‌:
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ సరిహదుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయినట్టు భద్రతాబలగాలు వెల్లడించాయి. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, మావోయిస్టు ఎస్‌జెడ్‌సీఎం బండి ప్రకాశ్‌ ఉన్నట్టు సమాచారం. చంద్రన్న తలపై రూ.కోటి రివార్డు ఉంది. బీజాపూర్‌ జిల్లా ఉసూర్‌ ప్రాంతంలోని లంకపల్లె అడవుల్లో ఎదురు కాల్పుల మోతలతో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -