Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన అంతర్జాతీయ తైక్వాండో విజేతలు

టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన అంతర్జాతీయ తైక్వాండో విజేతలు

- Advertisement -

నవతెలంగాణ -కంఠేశ్వర్ 
ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మొదటి ఏసియన్ అంతర్జాతీయ తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీల్లో నిజామాబాద్ టైం స్కూల్ విద్యార్థులు పలు విభాగాల్లో బంగారు పథకాలు సాధించారు. ఈ సందర్బంగా శనివారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను నిజామాబాద్ లోని వినాయకనగర్ లోని ఆయన నివాసంలో కలిశారు. అనంతరం పథకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో నిలపాలని కోరారు. తైక్వాండో అంతర్జాతీయ మాస్టర్ హీరాలాల్ మాట్లాడుతూ.. బి.నిహాల్ పీవీ వెయిట్ విభాగంలో పూమ్సే, క్యూరగి విభాగంలో రెండు స్వర్ణ పథకాలు, జి. శైనిక్ చంద్ర సబ్ జూనియర్ పుంసే, క్యూరగి విభాగంలో రెండు బంగారు పథకాలు, వై. ప్రణయ్ గౌడ్ అదే విభాగంలో రెండు స్వర్ణాలు, బాలికల విభాగంలో పంకజ పాటిల్ రెండు స్వర్ణ పథకాలు సాధించారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో మాస్టర్ సాకేత్, టైం స్కూల్ కరస్పాండెంట్ వినోద్ గౌడ్, ప్రిన్సిపాల్ యామిని, విద్యార్థుల తల్లిదండ్రులు సుభాష్ చంద్ర- అక్షయ, చేతన్- శృతి, యాదేశ్ గౌడ్- వీణా రాణి, పాఠశాల సిబ్బంది మౌనిక, శిల్ప, పద్మజ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -