Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మైబాపూర్ జీపీ సెక్రెటరీని వెంటనే విధుల నుంచి తొలగించాలి

మైబాపూర్ జీపీ సెక్రెటరీని వెంటనే విధుల నుంచి తొలగించాలి

- Advertisement -
  • – లేకపోతే నిరాహారదీక్ష చేస్తాం..
  • – ఎంపీడీవోకు , ఎమ్మార్వో కు, గ్రామస్తులు ఫిర్యాదు చేసి వినతి పత్రం అందజేత..
  • నవతెలంగాణ – జుక్కల్ 
  • మండలంలోని మైబాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి దురుసుగా వ్యవహరిస్తున్నారని గ్రామ ప్రజలు వందలాదిగా మండల కేంద్రానికి తరలి రావడం జరిగింది. గ్రామ కార్యదర్శి దాసరి విజయ్ కుమార్ గ్రామస్తులతో రాజకీయ పార్టీ నాయకుడు ఇలా మాట్లాడుతూ.. వారి అండదండలతో విర్రవీగుతున్నాడని గ్రామస్తులు కలిసికట్టుగా వచ్చి జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ కు, జుక్కల్ తాసిల్దార్ మారుతికి ఫిర్యాదు చేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినతి పత్రంలో గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. మా గ్రామ పంచాయతీ కార్యదర్శి దాసరి విజయ్ కుమార్ విధులు సక్రమంగా నిర్వహించకుండా,  ఒక రాజకీయ పార్టీ వ్యక్తి అండదండలతో గ్రామపంచాయతీ యందు అవినీతి , అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

    ఏదైనా పనుల కొరకు గ్రామ కార్యదర్శికి దగ్గరికి వెళితే ప్రజలని ఎదురు మాట్లాడుతూ.. బూతు మాటలు తిట్టి, ఎక్కువ మాట్లాడితే మీ అందరి పైన పోలీసు స్టేషన్ లో కేసు పెడతానని బెదిరిస్తున్నాడు. ఇదే సందర్భంలో తేదీ 18 సెప్టెంబర్ 2025 రోజు మా గ్రామానికి చెందిన కారేగాం అశోక్ రెడ్డి అను వ్యక్తి తనకు నాలుగు సంవత్సరాల నుండి గ్రామపంచాయతీలో జరిగిన అభివృద్ధి పనులను వాటి ఖర్చు వివరాలను అడిగినాడని తెలిపారు. అట్టి వివరాల కొరకు ఆర్టిఐ 2005 చట్టం ప్రకారం అడిగిన సమాచారం ఇస్తానని గ్రామపంచాయతీ కార్యాలయానికి  కార్యదర్శి దాసరి విజయ్ కుమార్ పిలిపించుకొని గ్రామస్తుడు కారేగాం అశోక్ రెడ్డి ని చేతులతో తట్టి కొట్టి , కాళ్లతో తన్ని , అనరాని మాటలు ,  బూతు మాటలతో నిన్ను చంపేస్తానని బెదిరించాడని అన్నారు. జిపి కార్యదర్శి తానే కొట్టి అశోక్ రెడ్డి కి కొట్టడం జరిగింది. జిపి కార్యదర్శి జుక్కల్ పీఎస్ కు వెళ్లి  అశోక్ రెడ్డి పై కార్యదర్శి విజయ్ కుమార్ కేసు పెట్టడం జరిగింది.

    ఇటువంటి సంఘటనలు గ్రామంలో నిత్యం ఎదుర్కొంటున్నామని గ్రామ ప్రజలు అతని వలన ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. గ్రామస్తులు పంచాయతీకి సంబంధించిన ఏవైనా  వివరాలు,  గ్రామపంచాయతీ ఖర్చులు అడిగినవారికి, ప్రజలకు అనరాని బూతు మాటలతో  బెదిరిస్తూ మీకు గ్రామపంచాయతీ లెక్కలు కావాలా రా? మీకు ఇవ్వను పోరా? బూతు మాటలు తిడుతూ,  నా వెంట ఉద్యోగ సంఘాలు అండదండలు ఉన్నాయని, రాజకీయ అండదండలు అడ్డుపెట్టుకొని అడిగినవారికి కేసులు పెడతానని,  జైలుకు పంపిస్తానని,  బెదిరిస్తూ తాను ఆడింది ఆట పాడింది పాటగా వ్యవహరిస్తున్నాడని వినతిపత్రంలో ఆరోపించారు. ఇటువంటి గ్రామపంచాయతీ కార్యదర్శిని విధుల నుండి వెంటనే తొలగించాలని, మా గ్రామానికి న్యాయం చేయగలరని, వినతి పత్రంలో గ్రామ ప్రజలు పేర్కొన్నారు. ఒకవేళ గ్రామ కార్యదర్శి దాసరి విజయ్ కుమార్  విధుల నుండి తొలగించకపోతే నిరాహార దీక్ష చేస్తామని అధికారులకు వినతి పత్రంలో తెలిపారు. 
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -