- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే దీన్ దయాల్ స్పర్శ యోజన రాతపూర్వక పోటీలకు దరఖాస్తులు గడువు ఈనెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు పట్టణ తపాలా శాఖ పోస్టుమాస్టర్ కిషన్ నాయక్ శనివారం తెలిపారు. ఈ పోటీలకు 6 నుండి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. రీజియన్ స్థాయి పోటీలు అక్టోబర్ 12న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా పోటీలలో పాల్గొనే విద్యార్థులు ఫిలాటలి డిపాజిట్ కాదా తప్పనిసరిగా తీయాల్సి ఉంటుందని, దరఖాస్తు ఫారాలు సైతం అన్ని తపాలా కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని ,విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరినారు.
- Advertisement -