Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు 

పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని శనివారం మండల కేంద్రంలో గల సుధా టెక్నో స్కూల్ తో పాటు మండలంలోని చెన్నూరు ఉన్నత పాఠశాలలో ముందస్తుగా బతకమ్మ సంబరాలను శనివారం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఆటపాటలతో, బతుకమ్మ పాటలతో విద్యార్థినీలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సుధాకర్ టెక్నో స్కూల్ పాఠశాల ప్రిన్సిపాల్ రాపాక విజయ్ కుమార్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు, తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ స్ఫూర్తిదాయకమన్నారు. బతుకమ్మ పండుగ మహిళలకు ఆత్మగౌరవ ప్రతీక అని అన్నారు. దసరా పండుగ సెలవుల సందర్భంగా పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -