నవతెలంగాణ – రాయపర్తి
తెలంగాణ ప్రజలు అత్యంత వైభవపేతంగా జరుపుకునే బతుకమ్మ పండుగను శనివారం మండల కేంద్రంలోని బ్లూమింగ్ బర్డ్స్ స్కూల్, లహరి పబ్లిక్ స్కూల్, మైలారం ప్రభుత్వ పాఠశాల, తదితర పాఠశాలల్లో విద్యార్థులు ముందస్తు బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన చిన్నారులు పూలతో బతుకమ్మను పేర్చి కోలాటం ఆడారు. ఈ సందర్భంగా మైలారం పాఠశాలలో నిర్వహించిన స్ఫూర్తి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ కిషన్ మాట్లాడుతూ.. విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండాలన్నారు. విద్యలో రాణించి జీవితంలో ఉన్నత శిఖరాలను అవరోధించాలని తెలిపారు. క్రీడలతో కూడా అత్యున్నతమైన స్థానంలో నిలవచ్చు అన్నారు. పూలను పూజించే ఏకైక సంప్రదాయం తెలంగాణలో మాత్రమే ఉందన్నారు. బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. తదుపరి చిన్నారులు బతుకమ్మలను మంచినీళ్ళ చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఉమా దేవి,బ్లూమింగ్ బర్డ్స్ స్కూల్ హెచ్ఎం ఎలగందుల సంతోష్, లహరి పబ్లిక్ స్కూల్ హెచ్ఎం రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES