Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు 

అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు 

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ
మండల కేంద్రంలోని ఆయా పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల, విశ్వశాంతి హై స్కూల్ లలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు పూలతో బతుకమ్మను అందంగా తయారు చేసి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కలిసి పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మ, కోలాటాలతో ఆడిపాడారు. మహిళా టీచర్లు విద్యార్థులకు సహకరించి అందమైన బతుకమ్మలను అలంకరించి బతుకమ్మ పాటలతో ఆడుతూ పాడుతూ బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు బతుకమ్మ ఉత్సవాలను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో, ముఖ్యంగా మహిళలు రావడంతో పాఠశాల ప్రాంగణం కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, మహిళా టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -