– వ్యాపారవేత్తలుగా రాణించాలి
– అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యార్ధి కుడి గా ఉద్యోగం సంపాదిస్తే అది వ్యక్తిగత కుటుంబానికే పరిమితం అని, అదే విద్యాధిక్యత తో ఏదో ఒక వ్యాపార వేత్తగా రాణిస్తే వ్యవస్థీకృతం గా సమాజంలో ఎంతో మందికి ఉపాధి కల్పించే స్థాయిలో ఉంటారని వ్యవసాయ విద్యార్ధులను ఉద్దేశించి వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత కుమార్ అన్నారు.
స్థానిక వ్యవసాయ కళాశాల లో అసోసియేట్ డీన్ డాక్టర్ జె. హేమంత కుమార్ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు వ్యవసాయ డ్రోన్లు, డ్రోన్ పైలెట్ గా ఉద్యోగ అవకాశాల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో డ్రోన్ పైలెట్ సాయికిరణ్ విద్యార్థులకు డ్రోన్ ల ఉపయోగాలు,వివిధ రంగాల్లో వాటి వాటి వినియోగం పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు డ్రోన్ వలన లాభాల ని విశ్లేషించి భవిష్యత్తులో మంచి రంగాలలో స్థిరపడాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో విద్యార్థులను డ్రోన్ వ్యాపార వేత్తలు గా తయారు చేయడానికి కావలసిన నైపుణ్యాలను కల్పించి కళాశాలలోని పత్తి, వరి ప్రయోగ పంటలలో పిచికారి చేసి విద్యార్థులకు నేరుగా చూపించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ నాగాంజలి, డాక్టర్ నీలిమ, డి.స్రవంతి, డాక్టర్ రవికుమార్,డాక్టర్ జెమీమా పాల్గొని విద్యార్థులకు సూచనలను ఇచ్చారు.