Saturday, September 20, 2025
E-PAPER
Homeఖమ్మం రైతుల "ఆత్మ".. సలహా సంఘాల విధులు - విధానాలు 

 రైతుల “ఆత్మ”.. సలహా సంఘాల విధులు – విధానాలు 

- Advertisement -


– ఏడీఏ పెంట్యాల రవికుమార్ 
నవతెలంగాణ – అశ్వారావుపేట

గత నాలుగేళ్ళుగా ఉనికిలో లేని రైతు సలహా సంఘాలను తిరిగి పట్టాలు పైకి ఎక్కించి రైతు సేవలకు మరింత చేరువ అయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నహాలు చేస్తుంది. ఈ క్రమంలో నియోజక వర్గాల వారీగా రైతు సలహా కమిటీలను రూపొందిస్తుంది.

కేంద్రం స్థాయిలో ఆత్మ (ఏటీఎంఏ ) – వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా,బ్లాక్( నియోజక వర్గం) స్థాయిలో ఏర్పాటు అయ్యే ఈ కమిటీలు ఉంటేనే కేంద్రం ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇచ్చే 60 శాతం నిధులు విడుదల చేస్తుంది.రాష్ట్ర ప్రభుత్వం మరో 40 శాతం నిధులను వెచ్చించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తాయి.

దీంతో ఈ బ్లాక్ రైతుల సలహా కమిటీలకు ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే అశ్వారావుపేట నియోజక వర్గానికి మండలానికి ఐదుగురు రైతులు చొప్పున 25 మంది సభ్యులతో ప్రముఖ వర్జీనియా పొగాకు,పామాయిల్ సాగు చేసే సీనియర్ రైతు సుంకవల్లి వీరభద్రరావు చైర్మన్ గా నామినేట్ చేయబడిన బీఎఫ్ఏసీ కమిటీని జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసారు.ఈ కమిటీ ఈ నెల 24 వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నది.

ఈ నేపధ్యంలో బీఎఫ్ఏసీ ప్రాధాన్యం,కమిటీ రైతులకు అందించే సేవలు,ఈ కమిటీతో ప్రభుత్వం నుండి వచ్చే నిధులు,ఈ సభ్యులు విధులు పై వ్యవసాయ శాఖ అశ్వారావుపేట సహాయ సంచాలకులు పెంట్యాల రవికుమార్ తెలిపిన వివరాలు ఈ క్రింది వ్యాసంలో తెలుసుకుందాం. సంబంధిత బ్లాక్ యొక్క ప్రముఖ్/పంచాయతీ సర్పంచ్/చైర్మన్ తాలూకా లేక మండల పరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ) బ్లాక్ రైతుల సలహా కమిటీ(బీఎఫ్ఏసీ) లో ఎక్స్ – అఫిషియో సభ్యుడిగా ఉంటారు.

– సంబంధిత బ్లాక్‌ లోని జిల్లా పరిషత్/ పంచాయతీ సభ్యులందరూ బీఎఫ్ఏసీ లో ఎక్స్ – అఫిషియో సభ్యులుగా ఉంటారు.
– అవార్డు గ్రహీత రైతులు లేదా వ్యవసాయం, అనుబంధ రంగాల నుండి శిక్షణ పొందిన రైతులు అయిన బ్లాక్‌ లోని 25 మంది ప్రగతిశీల రైతులను బీఎఫ్ఏసీ (బ్లాక్ ఫార్మర్స్ అడ్వైజరీ కమిటీ – బ్లాక్ రైతుల సలహా కమిటీ ) సభ్యులుగా నామినేట్ చేస్తారు.
– ప్రగతిశీల రైతుల నామినేషన్ కోసం రాష్ట్రాలు వారి స్వంత పారదర్శక మరియు ప్రజాస్వామ్య యంత్రాంగాన్ని రూపొందించి, ప్రకటిస్తాయి.అలా నామినేట్ చేయబడిన ప్రగతిశీల రైతులలో మూడింట ఒక వంతు మంది మహిళా రైతులు,మూడింట ఒక వంతు మంది చిన్న & సన్నకారు వర్గాల రైతులు ఉంటారు.ఎస్సీ ఎస్టీ రైతులకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వబడుతుంది.
– బీఎఫ్ఏసీ వ్యవధి రెండు సంవత్సరాలు ఉంటుంది, ఆ తర్వాత కొత్త రైతుల బృందం బీఎఫ్ఏసీ ని ఏర్పాటు చేస్తుంది.
– పైన పేర్కొన్న సభ్యుల నుండి చైర్మన్ ను భ్రమణ ప్రాతిపదికన ఎన్నుకుంటారు.
– బీటీఎం బీఎఫ్ఏసీ సభ్య కార్యదర్శిగా ఉంటుంది.
– ప్రతి త్రైమాసికానికి అంటే మూడు నెలలకోసారి బీఎఫ్ఏసీ రైతు సభ్యుడు వ్యవసాయం, అనుబంధ రంగానికి సంబంధించిన అంశాలపై పంచాయతీ ఎన్నికైన ప్రతినిధులతో కలిసి పంచాయతీ స్థాయిలో రైతుల సమావేశాన్ని నిర్వహిస్తారు. బీఎఫ్ఏసీ సమావేశాలలో తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు.పంచాయతీ స్థాయిలో కిసాన్ మిత్ర/కిసాన్ సలహాదారు/విషయ నిపుణుడు (సందర్భాన్ని బట్టి) అటువంటి సమావేశాన్ని సమన్వయం చేసి సులభతరం చేస్తారు. వ్యవసాయ అనుభంద రంగాల అధికారులు బ్లాక్ ప్రణాళిక రూప  కల్పనలో పాలు పంచుకుంటారు.

బ్లాక్ రైతుల సలహా కమిటీ ఆధ్వర్యంలో రైతు శిక్షణకు గుర్తించబడిన ప్రాధాన్య రంగాలు ఈ క్రింది విదంగా వున్నాయి :

– సహజ వ్యవసాయం
– వాతావరణ స్థితి స్థాపక వ్యవసాయం,
– పంటల వైవిధ్యీకరణ,
–  జాతీయ తెగులు నిఘా వ్యవస్థ,
– సాయిల్ హెల్త్ కార్డ్ సలహాలు
– డిజిటల్ అగ్రికల్చర్ మిషన్
– పంట కోత తర్వాత నిర్వహణ
– మార్కెట్ నేతృత్వంలోని పొడిగింపు
– విత్తన ఉత్పత్తి,విత్తన సాంకేతిక అంశాలు
– మంచి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం.
– ప్రధాన పంటలలో సమగ్ర తెగులు నిర్వహణ పద్ధతులు.
– పండ్లు,కూరగాయలు,వేరు , దుంప పంటలు, పుట్టగొడుగులు,సుగంధ ద్రవ్యాలు,పువ్వులు,సుగంధ మొక్కలు,కొబ్బరి,కోకో, వెదురు వంటి ఉద్యానవన రంగం యొక్క సమగ్ర వృద్ధి.
– సాయిల్ హెల్త్ కార్డ్ సిఫార్సుల ఆధారంగా రసాయన ఎరువులను వివేక వంతంగా ఉపయోగించడం.
– నూనె గింజల పై జాతీయ మిషన్ ప్రమోషన్.
– తక్కువ నీరు వినియోగించే చిరు ధాన్యాలు/పోషక – తృణధాన్యాల పంటలను ప్రోత్సహించడం.
– కస్టమ్ హైరింగ్ సెంటర్ యాప్‌ లో రైతుల నమోదు
– మొక్కజొన్న, బార్లీ కోసం ముతక తృణధాన్యాలు మరియు ముతక తృణధాన్యాల ఆధారిత పంట వ్యవస్థలు
– ఎఫ్ఐజీస్/సీఐజీస్/ఎఫ్ఎస్జీస్ లను ఎఫ్పీఓ స్  గా ఫెడరేషన్ చేయడం
– వ్యవసాయ యాంత్రీకరణ
– వర్షాధార ప్రాంతాలలో సమగ్ర వ్యవసాయ వ్యవస్థ
– తేనెటీగ
– కిచెన్ గార్డెనింగ్
– ఏపీఈడీఏ ఎగుమతి క్లస్టర్ల కోసం విస్తరణ శిక్షణలు
– రైతు శిక్షణ, క్షేత్ర సందర్శనలు, ప్రదర్శనలు మరియు వ్యవసాయ పాఠశాలలను కూడా  ప్రాధాన్యత ప్రకారం నిర్ణయించవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -