Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బావిలాల ఉన్నత పాఠశాల విద్యార్థులకు అతిధి భోజనం 

బావిలాల ఉన్నత పాఠశాల విద్యార్థులకు అతిధి భోజనం 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన గంట శ్యామ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తూ అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి పొందడంతో శనివారం వావిలాల ఉన్నత పాఠశాలలోని విద్యార్థిని, విద్యార్థులకు అతిధి భోజనాన్ని ఏర్పాటు చేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్య తెలిపారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ పాఠశాలలోని 120 మంది విద్యార్థినీ, విద్యార్థులకు గంట శ్యామ్ అతిథి భోజనాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. అతిథి భోజనాన్ని ఏర్పాటుచేసిన శ్యామ్ ను మహాత్మా హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు గంట రవీందర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ కొనుకటి రాణి యాకూబ్ రెడ్డి, ముత్తారం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు భూసరాజు అంజయ్య, వావిలాల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు తండ మల్లయ్య, ఉపాధ్యాయులు వరప్రసాద్ ,సోమాని నాయక్, బాలాజీ ,కొండయ్య, జస్సిoతారాణి , సుగుణ దేవి, కవిత , సి అర్ పి సాంబయ్య, కిషన్, సరేష్ ,అరుణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -