ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్
నవతెలంగాణ – పాలకుర్తి
2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల చైతన్య యాత్రలో భాగంగా శనివారం మండల కేంద్రంలో గల రాజీవ్ చౌరస్తాలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని 584 మండలాల్లోని ఉద్యమకారులు సీఎం రేవంత్ రెడ్డిని కోరామని తెలిపారు. ఉద్యమకారుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యమకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 26న హైదరాబాదులో గల ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే ఉద్యమకారుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యమకారులకు పిలుపునిచ్చారు.
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని, 250 గజాల ఇంటి స్థలం, 25 వేల పెన్షన్, ఉద్యమకారుల అభివృద్ధి కోసం ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి బడ్జెట్లో పదివేల కోట్ల నిధులను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఉచిత బస్సు, ట్రైన్ ,ఆరోగ్య కార్డులు, సంక్షేమ పథకాలలో 20% కోటా కేటాయించాలని, 1200 మంది అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకారులకు ప్రాధాన్యత కల్పించాలని, పదవులు కేటాయించాలని కోరారు, ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు నందగిరి రజినీకాంత్, రాష్ట్ర కార్యదర్శి నలమాస రమేష్ గౌడ్, జనగామ జిల్లా అడః కమిటీ కన్వీన ర్ గుగులోతు (రాములు) దేవ్ సింగ్ నాయక్, నియోజకవర్గ కన్వీనర్ సంఘీ వెంకన్న యాదవ్, మండల అధ్యక్షులు అనుముల అంజిరావు, ఉద్యమకారులు వీరమల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -



