Saturday, September 20, 2025
E-PAPER
Homeజిల్లాలువివేకానంద డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

వివేకానంద డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: విద్యానగర్ లోని వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు కళాశాల ప్రధానాచార్యులు డా. కె. ప్రభు అధ్యక్షతన ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల కల్చరల్ కమిటీ కోఆర్డినేటర్ ప్రొ. ముక్తావని , ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ & ప్రోగ్రాం ఆఫీసర్ డా. ఓ. పద్మజ, వైస్ ప్రిన్సిపల్ లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొని, పూలతో అద్భుతంగా బతుకమ్మలను పేర్చి తమ సాంస్కృతిక వైభవాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. .కె. ప్రభు మాట్లాడుతూ..“తెలంగాణ రాష్ట్ర సాధనలో బతుకమ్మ పండుగకు ఉన్న ప్రాధాన్యం ఎంతో గొప్పది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పండుగకు మరింత ప్రాచుర్యం వచ్చింది. బతుకమ్మ పండుగ మన తెలంగాణ ప్రజల బతుకు, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం. ఈ ఉత్సవం ద్వారా మన యువతకు తమ మూలాలను గుర్తుచేస్తూ, వారిలో సాంస్కృతిక విలువలను నాటుతుంది” అని పేర్కొన్నారు. తరువాత ప్రిన్సిపాల్ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు విజేతలైన విద్యార్థినులకు అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -