సర్వం సిద్ధం చేసిన పంచాయతీ కార్యదర్శులు
నవతెలంగాణ-పాలకుర్తి
సంస్కృతి, సాంప్రదాయాలకు స్ఫూర్తినిచ్చే బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం జరిగే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు పాలకుర్తి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో చెరువు గట్ల వద్ద, పాఠశాలల్లోని మైదానాలు ముస్తాబయ్యాయి. సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే బతుకమ్మ వేడుకలను తెలంగాణలోని ఆడపడుచులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. బతుకమ్మ వేడుకలకు మైదానాల వద్ద పంచాయతీ కార్యదర్శులు విద్యుత్ దీపాలను అలంకరించారు. ప్రశాంతమైన వాతావరణం లో బతుకమ్మ వేడుకలు నిర్వహించుకోవాలని పాలకుర్తి సీఐ బంగాళా జానకిరామ్ రెడ్డి, ఎస్సై దూలం పవన్ కుమార్లు సూచించారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా మైదానాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా బందోబస్తు చర్యలు చేపడుతున్నా మని తెలిపారు. ఆటపాటలతో ఆడపడుచులు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను జరుపుకోవాలని సూచించారు.
బతుకమ్మ వేడుకలకు ముస్తాబైన మైదానాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES