Sunday, September 21, 2025
E-PAPER
Homeఆదిలాబాద్గంగ నీళ్ళ జాతరను విజయవంతం చేయాలి

గంగ నీళ్ళ జాతరను విజయవంతం చేయాలి

- Advertisement -
  • ఆలయచైర్మెన్ సింగం భోజగౌడ్..
  • నవతెలంగాణ – సారంగాపూర్
    మండలంలోని ప్రసిద్ధి గాంచిన అడెల్లి శ్రీ పోచమ్మ ఆలయం గంగ నీళ్ళ జాతర ను విజయ వంతం చేయాలని ఆలయ ఛైర్మెన్ సింగం బోజ గౌడ్ అన్నారు. శనివారం ఆలయం వద్ద వివిధ మండల అధికారులు,ప్రజా ప్రతినిధులతో  జాతర సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
  • ఈ నెల 27,28 శని  ఆదివారం ల్లో  జాతర జరుగుతుంది, శనివారం అమ్మవారి నగలతో భక్తులు, సేవశారులు కాలినడకన  ఆలయం నుండి బయలుదేరి అడెల్లి, సారంగాపూర్, యక రపల్లి,వంజార్,ప్యరమూర్, మడేగం ,దిలవార్ పూర్ మీదుగా స్వాంగి గ్రామ సమీపంలోని గోదావరి కి చేరుకుతోంది ఆదివారం గంగ జలతో నగలను శుద్ధి చేసి తిరిగి అదే దారిలో తిరిగి ఆలయని కి చేరుకుంటారు.

కావున అన్ని శాఖల వారు సమన్వయంతో సహారన్ని అందించాలని కోరారు. నిర్మల్ రూరల్  సీఐ కృష్ణ పోలీస్ సిబ్బందితో కలసి సాంగ్వి గ్రామంలోని గోదావరి నది ఒడ్డున వెళ్ళి పరిసరాలను పరిశించి మాట్లాడుతూ..పోలీస్ తరపునజాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా పూర్తి బంధు బస్తు నిర్వహిస్తాం జాతర పొడుగునా అన్ని గ్రామ పెద్దలు, అధికారులు సహకారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రంలో స్థానిక ఎస్సై  శ్రీకాంత్, దిలావార్ పూర్ ఎస్సై రవీందర్, ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు, ఎంపిఓ అజీజ్ ఖాన్, కరెంట్ ఏ.ఈ  సాయి కిరణ్,రెవిన్యూ అధికారులు,వైద్య సిబ్బంది,ఆయా గ్రామాల నాయకులు పాలోన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -