Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వికలాంగుల పెన్షన్ రూ.6000 లకు పెంచి ఇవ్వాలి 

వికలాంగుల పెన్షన్ రూ.6000 లకు పెంచి ఇవ్వాలి 

- Advertisement -

అర్హులందరికీ కొత్త పెన్షన్స్ మంజూరు చేయాలి
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి నరసింహ
నవతెలంగాణ – వనపర్తి 

వికలాంగుల పెన్షన్ రూ .6000 లకు పెంచాలని, కొత్త పెన్షన్స్ మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి మల్లెపు నరసింహ అన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు స్థానిక ఆర్డిఓ కార్యాలయం ఎదుట వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రభు స్వామి, మల్లెపు నరసింహ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ రూ.4016 నుండి రూ.6000లకు, వృద్ధులు, వితంతువులతో పాటు మిగతా చేయూత పెన్షన్స్ 2016 నుండి రూ.4000 లకు పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 21 నెలలు అవుతుంది.

కానీ పెన్షన్ పెంపు కోసం ఎలాంటి చర్యలు తీసుకువడం లేదు. పెన్షన్ పెంచకుండానే ప్రస్తుతం ఇస్తున్నా పెన్షన్స్ లలో 1.92 లక్షల మంది పెన్షన్స్ 21 నెలల కాలంలో రద్దు చేశారు. 2023 డిసెంబర్ నెలలో ప్రజాపాలన పేరుతో కొత్త పెన్షన్స్ కోసం ప్రభుత్వం లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తే 24.85 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. 21 నెలల నుండి కొత్త పెన్షన్స్ కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదు. పెన్షన్ పెంపు, కొత్త పెన్షన్స్ మంజూరు కోసం 21 నెలల నుండి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. 2025-26 బడ్జెట్లో నిధుల కేటాయింపులో ప్రభుత్వం చేయూత పెన్షన్స్ కోసం అవసరమైన నిధులు కేటాయించలేదు.పెన్షన్ పెంపు, కొత్త పెన్షన్స్ మంజూరు చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంగారయ్య ఉపాధ్యక్షులు ఆంజనేయులు మహిళా విభాగం కన్వీనర్ భాగ్యలక్ష్మి పార్వతమ్మ జిల్లా నాయకులు చెన్నయ్య రామాంజనేయులు లక్ష్మన్న రాజు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -