Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దేవి విద్యోదయలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

దేవి విద్యోదయలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
సద్దుల బతుకమ్మ వేడుకలు పురస్కరించుకుని శనివారం మండలంలో కొయ్యుర్ గ్రామంలోని దేవి విద్యోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు అంగరంగవైభవంగా నిర్వహించ్చినట్లుగా పాఠశాల కరస్పాండెంట్ కుడుదుల రాజు తెలిపారు. ఈ సందర్భంగా తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ఉపాధ్యాయురాళ్లు, విద్యార్థినిలు బతుకమ్మ ఆడారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని, తెలంగాణ ఆడపడుచులు తొమ్మిది రోజులపాటు పూల పండుగ నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -