Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ సంబరాలు..

ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ సంబరాలు..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
బతుకమ్మ సంబరాలు పురస్కరించుకుని మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామారావు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు శనివారం నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు తలమానికమన్నారు. బతుకమ్మ సంబరాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆటపాటలను రకరకాల పూలతో పేర్చిన బతుకమ్మలను చూసి ఆనందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ మాట్లాడారు. పిల్లలు చదువుతో పాటు, మన సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు సెలవుల్లో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, విద్యుత్ వాటికి దూరంగా ఉండేలా తల్లిదండ్లులు తగుజాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి. కవిత,ఏం.కవిత పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -