Sunday, September 21, 2025
E-PAPER
Homeఆటలుమంధాన శతకబాదినా..!

మంధాన శతకబాదినా..!

- Advertisement -

మూడో వన్డేలో
భారత్‌ ఓటమి
న్యూఢిల్లీ :
స్మతీ మంధాన (125, 63 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధనాధన్‌ సెంచరీతో మెరిసినా ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. దీప్తి శర్మ (72, 58 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (52, 35 బంతుల్లో 8 ఫోర్లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. న్యూఢిల్లీలో శనివారం జరిగిన మూడో వన్డేలో 413 పరుగుల ఛేదనలో భారత్‌ 47 ఓవర్లలో 369 పరుగులు చేసింది. దీంతో ఆసీస్‌ అమ్మాయిలు 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. మంధాన ధనాధన్‌ మెరుపులతో 20 ఓవర్లలోనే 200 పరుగుల మార్క్‌ దాటింది. కానీ మంధాన నిష్క్రమణతో ఛేదనలో దూకుడు కాస్త తగ్గింది. ఆఖర్లో రాధ యాదవ్‌ (18), స్నేV్‌ా రానా (35, 41 బంతుల్లో 3 ఫోర్లు) పోరాడినా ఓటమి తప్పలేదు. ఆసీస్‌ బౌలర్లలో మేగన్‌ రెండు వికెట్లు, కిమ్‌ మూడు వికెట్లు పడగొట్టారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 47.5 ఓవర్లలో 412 పరుగులకు ఆలౌటైంది. బెత్‌ మూనీ (138), ఎలిసీ (68), జార్జియా (81)లు రాణించటంతో ఆసీస్‌ అమ్మాయలు వన్డేల్లో రికార్డు స్కోరు సాధించారు. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ను 2-1తో ఆసీస్‌ సొంతం చేసుకోగా.. మంధాన ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -