Sunday, September 21, 2025
E-PAPER
Homeసినిమాపోటీల్లో పాల్గొని ప్రతిభను చాటండి

పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటండి

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఆధ్వర్యంలో ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా నిర్వహిస్తున్న ‘బతుకమ్మ యంగ్‌ ఫిల్మ్‌మేకర్స్‌ ఛాలెంజ్‌’ బ్రోచర్‌, పోస్టర్‌లను శనివారం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘తెలంగాణ చరిత్ర, సంస్కతి, కళా రూపాలు, ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వీడియోలను రూపొందించి, యువ కళాకారులు తమలోని సజనాత్మకతను ప్రపంచానికి చాటే ఈ మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. పోటీలో పాల్గొని బహుమతులు గెలుచుకోండి. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టీఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజును అభినందిస్తున్నాను. ముఖ్య మంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళేందుకు, యువ కళాకారుల ప్రతిభ వెలుగులోకి తెచ్చేందుకు ఈ పోటీ సరైన వేదిక కానుంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -