1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మాతలు అక్కినేని వెంకట్, సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమను ‘బిఫోర్ శివ’ , ‘ఆఫ్టర్ శివ’గా రీడిఫైన్ చేసిన ఈ సినిమా గ్రేటెస్ట్ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఈ చిత్రాన్ని ఏయన్నార్ 101వ జయంతి నేపథ్యంలో నవంబర్ 14న రీ- రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, ‘సినిమాకి తరాలకు మించి జీవించే శక్తి ఉందని నాన్న ఎప్పుడూ నమ్మారు. ‘శివ’ అలాంటి ఒక చిత్రం. నవంబర్ 14న ‘శివ’ పూర్తిగా కొత్త అవతార్‌లో 4కె డాల్బీ అట్మాస్‌తో మళ్ళీ బిగ్ స్క్రీన్ పైకి తీసుకురావడం కథలను ఎప్పటికీ సజీవంగా ఉంచాలనే నాన్న కలకు నివాళి’ అని అన్నారు.
‘ఈసారి ప్రేక్షకులు ఇంతకుముందు ఎప్పుడూ వినని విధంగా, పూర్తిగా కొత్త అనుభూతిని పొందుతారు. ఆ అనుభవాన్ని చూడటానికి నేనూ ఎదురు చూస్తున్నాను’ అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పారు.
ఇప్పటి వరకు ఏ రీ-రిలీజ్ సినిమాకు లేని విధంగా డాల్బీ ఆట్మాస్ సౌండ్‌తో ప్రేక్షకులను అలరించబోతోంది. మోనో మిక్స్‌లో ఉన్న ‘శివ’ సౌండ్‌ను అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో రీ-మాస్టర్ చేసి, అడ్వాన్స్ డాల్బీ ఆట్మాస్‌లోకి మార్చి నవంబర్ 14న రీ-రిలీజ్ చేస్తున్నారు.
ఏఎన్నార్ 101వ జయంతి సందర్భంగా ‘శివ’ రీ- రిలీజ్‌కి రెడీ
- Advertisement -
- Advertisement -