ఆ పార్టీలో చేరే ఉద్దేశం లేదు
కొత్తపార్టీ పెట్టడంపై నిర్ణయం తీసుకోలేదు
కాంగ్రెస్ నుంచి బయటికి రేవంత్‌రెడ్డి? : ఇష్టాగోష్టిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు పోతున్నాడేమో అన్న అనుమానం కలుగుతున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రేవంత్‌రెడ్డి తన పేరును పదేపదే తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో ఆమె చిట్ చాట్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో అప్రోచ్ కాలేదనీ, ఆ పార్టీలో చేరే ఉద్దేశమే తనకు లేదని స్పష్టం చేశారు. కొత్త పార్టీ పెట్టాలా? వద్దా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పార్టీ పెట్టేముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారనీ, ప్రస్తుతం తాను అదే చేస్తున్నానని తెలిపారు. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతుర్ని తానేనని వాపోయారు. నీటిపారుదల శాఖలో జరుగుతున్న పరిణామాలపై కేటీఆర్‌ను 2016లో అలర్ట్ చేశానని గుర్తుచేశారు. కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కూడా కేసీఆర్ దేనని పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హరీశ్‌రావు చెప్పారని గుర్తుచేశారు. కాళేశ్వరం విషయంలో తప్ప మిగతా అంశాల్లో హరీశ్‌రావుపై తనకు కోపంలేదన్నారు. తాను ఒక వర్గం కోసం కాకుండా ప్రజలందరి కోసం పనిచేయాలనుకుంటున్నానని చెప్పారు. బీసీ అంశం తన మనస్సుకు దగ్గరగా ఉందన్నారు. తాను ప్రస్తుతం ఫ్రీ బర్డ్‌ననీ, ద్వారాలు ఇంకా తెరిచే ఉన్నాయని చెప్పారు. తనతో టచ్‌లో ఉన్న బీఆర్‌ఎస్ నేతల లిస్టు చాలా పెద్దగా ఉందనీ, ఇతరులు కూడా పెద్ద ఎత్తున కలుస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలను తీసుకుని ముందుకు పోతానని చెప్పారు.
కాంగ్రెస్ నేతల్ని కలవలేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES