Sunday, September 21, 2025
E-PAPER
Homeకవితకాలమంచున

కాలమంచున

- Advertisement -

1.రాయమని వారు నన్ను పదే పదే బలవంత పెడతారు
ఈ ఖాళీతనాన్ని పూరించుకునే ఖాళీని కాలం ఇవ్వట్లేదని
వాళ్ల నుండి నేను తప్పించుకు తిరుగుతూ ఉంటాను
రోజంచున ఒక్కడు మాత్రం నన్ను పట్టుకుని నిలదీస్తాడు

2.రాలిపోయిన ఎర్రటి గతం
కాలిపోయిన పచ్చని అడవి
రెక్కలు విరిగిన తెల్లని పక్షి
ఉన్నట్టుండి సమస్త భూమండలం నాదైపోతుంది
పదే పదే పగిలిపోయే వస్తువు ఒకటి నాతో ఉందని స్పహించాక జాగ్రత్త పడతాను
అయినా నా ప్రమేయం లేకుండానే ఆ రాత్రి యుద్ధం మొదలవుతుంది
నిరాయుదురాలినైన నాపై దాడి జరుగుతుంది
గాయం లేకుండానే హదయం ముక్కలవుతుంది
ఆ రాత్రంతా విషాద సముద్రంలో కొట్టుకపోతాను

3.ఆధారాలేవి లేవని నిర్ధారించుకున్నాక
దయలేని కాలం ఉదయిస్తూ నన్ను నిందితురాలిని చేస్తుంది
వేల ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ సతమతమవుతూ ఉంటాను
సర్దుబాటులన్నీ కుంగుబాటులవుతాయి
వేదనలన్నీ మౌనాలవుతాయి
అందుకోలేని నిశ్శబ్దంలోకి నేను వెళ్లిపోయాక
రాయడానికి ఏ వాక్యము మిగిలిలేదని వాళ్ళకి ఎలా చెప్పేది.

    • పి.సుష్మ
    - Advertisement -
    RELATED ARTICLES
    - Advertisment -

    తాజా వార్తలు

    - Advertisment -