Sunday, September 21, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు

ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు

- Advertisement -

పూలను పూజిస్తూ.. ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే గొప్ప పండుగ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి
శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సురేఖ, సీతక్క
నేడు వరంగల్‌లో బతుకమ్మ ప్రారంభ వేడుకలు… పాల్గొననున్న మంత్రులు కొండా సురేఖ, సీతక్క, జూపల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఈ మేరకు సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పూలను పూజిస్తూ ప్రకతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయలకు, ఆడపడుచుల ఔన్నత్యా నికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ కలిసి సంతోషంగా జరుపు కోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ సాముహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమని తెలిపారు. ఎంగిలిపూల నుంచి సద్దుల వరకూ తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ సంబురాలను ఆట పాటలతో అందరూ వైభవంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనీ, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని గౌరమ్మను సీఎం ప్రార్థించారు.

తెలంగాణ సంస్కృతికి చిహ్నం.. అస్తిత్వానికి ప్రతిరూపం : డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ చిహ్నమనీ, అస్తిత్వానికి ప్రతిరూపమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆటపాటలతో, ఆనందోత్సాహాల మధ్య తెలంగాణ ఆడబిడ్డలందరూ బతుకమ్మ పండుగ జరుపుకోవాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సామూహిక జీవనానికి, ఐకమత్యానికి, సంఘటిత శక్తికి ప్రతీక మన బతుకమ్మ పండుగ నిలుస్తున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో ప్రకృతిమాత బతుకమ్మ వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి బతుకమ్మ నిలువెత్తు నిదర్శనమని పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ (సీతక్క) పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మలో ఉపయోగించే ప్రతి పువ్వుకీ ఔషధ గుణాలుంటా యనీ, తీరొక్క పూలతో ప్రకృతి మాతకు కృతజ్ఞత చాటే పండగ బతుకమ్మ అని కొనియాడారు. ఆడబిడ్డ ల ఆత్మగౌరవ అడ్డా అయిన ఓరుగల్లు గడ్డమీద బతుకమ్మ సంబురాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయనీ, ఆరంభ వేడుకల్లో తనతో పాటు ఇతర మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క పాల్గొం టారని మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. మహిళ లకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసిందని ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -