- Advertisement -
మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హెచ్-1బీ వీసాల వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. యువతపై భారం పడకుండా వీసాలపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని శనివారంనాడొక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం సరికాదన్నారు. తక్షణం అమెరికాతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని కోరారు.
- Advertisement -