Sunday, September 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఇవాల్టి నుంచి దసరా సెలవులు

ఇవాల్టి నుంచి దసరా సెలవులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. ఇవాల్టి నుంచి దసరా అలాగే బతుకమ్మ సెలవులు ప్రారంభం కానున్నాయి. నిన్న సాయంత్రానికి స్కూళ్లు ముగియడంతో… చాలామంది సొంత ఊర్లకు బయలుదేరారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉండే వాళ్లు… తమ సొంత గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. అలాగే ఏపీకి వెళ్లేవారు కూడా హైదరాబాదు నుంచి ఎక్కువగానే వెళ్తున్నారు. దాదాపు 13 రోజులపాటు తెలంగాణలో స్కూళ్లకు దసరా సెలవులు దక్కనున్నాయి.

ఇది ఇలా ఉండగా నేటి నుంచి ఈ బతుకమ్మ పండుగ గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. తొమ్మిది రోజులపాటు ఈ బతుకమ్మ పూల పండుగ జరగనుంది. ప్రకృతి ఇచ్చిన పూలను దేవతగా భావించి ఈ బతుకమ్మను ఆరాధిస్తారు. తొలిరోజునూ చిన్న బతుకమ్మ లేదా ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు అన్న సంగతి తెలిసిందే. చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు. కాగా తెలంగాణ‌లో ఇవాళ్టి నుంచి అంటే సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3, 2025 వరకు పాఠశాలలు మూసివేయబడతాయి. తెలంగాణలో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5, 2025 వరకు కళాశాలలు మూసివేయబడతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -