- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పండుగపూట ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జలపాతంలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్ లో ఉండే 8 మంది స్నేహితులు కలిసి సెప్టెంబర్ 21న ములుగు జిల్లాలోలని వాజేడు మండలంలోని కొంగాలజలపాతం దగ్గరకు వెళ్లారు. జలపాతం దగ్గరకు వెళ్లి కాసేపు సరదాగా గడిపారు. అందులో ఒకరు మహాన్వేష్ అనే యువకుడు వాటర్ దగ్గర సెల్పీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు జలపాతంలో జారిపడి మృతి చెందాడు. మృతుడిది హైదరాబాద్ లోని ఉప్పల్. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు యువకుడి మృతదేహాన్ని పరిశీలించారు. యువకులంతా అనుమతి లేకున్నా జలపాతం దగ్గరకు వెళ్లినట్లు చెప్పారు.
- Advertisement -