Sunday, September 21, 2025
E-PAPER
Homeఆదిలాబాద్దుండగులను కఠినంగా శిక్షించాలి

దుండగులను కఠినంగా శిక్షించాలి

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్ 
లోకేశ్వరం మండలంలోని రాయపూర్ కాండ్లి గ్రామంలో  బీరప్ప ఆలయ శిఖర ధ్వంసానికి పాల్పడిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ముధోల్ కురుమ సంఘం ఆధ్వర్యంలో  ఆదివారం డిమాండ్ చేశారు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని దన్గరగల్లీ లోని పోచమ్మ ఆలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కురుమ సంఘ సభ్యులు దేవోజీ భూమేష్, మెత్రి సాయినాథ్ మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా  అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరారు. దుండగులను తక్షణమే పట్టుకోవాలని అన్నారు.లేని యేడల కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన లు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో కురుమ సంఘం నాయకులు  విట్టల్, నరేష్, మారుతి, శ్రీనివాస్, రాజేందర్, కామాజీ, బీరన్న, పిరజీ, సాయినాథ్, సాయన్న, నగేష్, నరేష్, శివాజీ, హన్మంతు , కోలేకర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -