నవతెలంగాణ – ఆలేర్
ఆలేరు పట్టణ కేంద్రంలోని శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రాంగణంలో ఆదివారం నాడు ఆలేరు పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలేరు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు పాశికంటి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి చిక్క శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,సహకార ఉద్యమ పితామహుడు,తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు,భారత స్వాతంత్ర ఉద్యమ కాగడా శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు ఆదర్శప్రాయం అన్నారు.
స్టేట్ కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. సమాజానికి ఎన్నో రకాల సేవలను అందించడం జరిగిందన్నారు.శాసన సభ్యునిగా,డిప్యూటీ స్పీకర్ గా,మంత్రిగా ఎన్ని రాజకీయ పదవులు అనుభవించినా అతనికి తృప్తిని ఇవ్వలేకపోయింది అందుచేత తెలంగాణ తొలి,మలిదశ ఉద్యమ కాగడై తెలంగాణ ఆత్మాభిమానం దెబ్బతిన్న ప్రతిసారి తన నిరసన గలాన్ని వినిపిస్తూ, ప్రాంతమా – పదవా అనే ప్రస్తావన వచ్చినప్పుడు నిస్సందేహంగా తన పదవులను వదిలేసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోషరన్నారు.ఇంతటి మహానుభావుడు మన పద్మశాలి ముద్దుబిడ్డ అయినందుకు గర్వపడాలి.
ప్రతి ఒక్కరూ బాపూజీ ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు అవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో బేతి రాములు, బింగి నరసింహులు, బడుగు జహంగీర్, గుండు జగన్మోహన్,ఆడెపు బాలస్వామి,బేతి శ్రీనివాస్,గట్టు రాజు,రాచర్ల నరసింహులు,గుజ్జ అశోక్ మెరుగు శ్రీధర్,భోగ సంతోష్, బొంతపల్లి మధు, రేగుటి వెంకటేష్,చింతకింది సిద్ధులు, దొంత వెంకటేష్,వెంకటేష్,చిట్టి మిల్ల కృష్ణ,బేతి నాగరాజు, బేతి చందు, చింతకింది ఉమేష్,బేతి ఆంజనేయులు,బోడ శ్రీశైలం,చింతకింది గణేష్, చింతకింది గిరి ప్రసాద్, యాకుబ్ స్వామి పాల్గొనడం జరిగింది.