నవతెలంగాణ – బిచ్కుంద
తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతిని పురస్కరించుకొని బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని మార్కండేయ పద్మశాలి సంఘం ఆవరణలో సంఘo మండల అధ్యక్షులు గుద్దేటి హనుమాన్లు ఆధ్వర్యంలో సభ్యులతో కలిసి కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పద్మశాలి సంఘం బాన్సువాడ డివిజన్ అధ్యక్షులు డాక్టర్ రాజు మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర సమరయోధులు, బహుజనుల ఆశాజ్యోతి, రాజకీయ మంత్రి పదవులను సైతం త్యాగం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించి అనేక పోరాటాలు చేసిన వీరుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జలదృశ్యంలో ఉన్న తన సొంత ఇంటిని తెలంగాణ పార్టీ ఆఫీసు కొరకు ఇచ్చిన మహా త్యాగశీలుడని 96 సంవత్సరాల వయస్సులో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరహార దీక్ష చేసి అలుపెరుగని ఉద్యమ పోరాట యోధుడిగా యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శేర్ల బాలరాజ్, కోశాధికారి ప్రతాప్, కుల పెద్దలు బోడ అంజయ్య, మలేగాం పరమేష్, రచ్చ శివకాంత్, జగదీష్ పద్మశాలి యువజన సంఘ సభ్యులు బబ్లు, గొడబర్ల శివ, వెంకటి, బాలకిషన్, శ్రీనివాస్, రాజు, శేర్ల లక్ష్మన్,శీను, పరమేష్, పద్మశాలి కుల సభ్యులు పాల్గొన్నారు.
బిచ్కుందలో కొండాలక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES