Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ మొదలైంది..

ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ మొదలైంది..

- Advertisement -

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
ఎంగిలిపూల (వివిధ రకాల పూలు) బతుకమ్మతో పండుగ మొదలైంది.బతుకమ్మ అంటే “బతుకు అమ్మ” అని అర్ధం, ఇది మహిళల సంతోషాన్ని, వారి ఐక్యతను చాటి చెబుతుంది. నగరంలో లో బతుకమ్మ పండుగ కోలహాలంగా వివిధ బస్తీలలో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు పాటలు పాడుతూ ఆడారు. బతుకమ్మ పండుగ పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి ఆరాధనకు ఈ పండుగ ఒక గొప్ప ఉదాహరణ.

బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత:
బతుకమ్మ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, అది తెలంగాణ సంస్కృతి, పర్యావరణ స్పృహను చాటి చెబుతుంది. ఈ పండుగ మహిళల ఐక్యతను, వారి సృజనాత్మకతను వెలికి తీస్తుంది. పూల ఆరాధనతో ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని, గౌరవాన్ని తెలియజేస్తుంది. బతుకమ్మ పాటలు, నృత్యాలు తెలంగాణ గ్రామీణ జీవితాన్ని, సంప్రదాయాలను మన కళ్ళ ముందు నిలబెడతాయి.

బతుకమ్మ  ఒక కళాత్మక ప్రక్రియ. తెలంగాణలో విరివిగా లభించే గునుగు, తంగేడు, చామంతి, బంతి, నందివర్ధనం వంటి రంగుల పూలను ఉపయోగిస్తారు. వెడల్పాటి పళ్లెంలో గునుగు పూలను గుమ్మడి పూల మధ్యలో, ఆ తరువాత తంగేడు పూలను, ఇతర రంగుల పూలను పేర్చి, బతుకమ్మను శంఖాకారంలో అలంకరిస్తారు. బతుకమ్మ మధ్యలో పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. పిరమిడ్లాగా అందంగాతొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకలు 21వ తేదీన ప్రారంభమైన ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రతి రోజు బతుకమ్మను ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తూ, వేర్వేరు నైవేద్యాలు సమర్పిస్తారు.

ఎంగిలి పూల బతుకమ్మ:
పండుగ మొదటి రోజు ముందురోజు సేకరించిన పూలతో బతుకమ్మను తయారుచేస్తారు. నైవేద్యంగా నువ్వులు, బియ్యంపిండి, సగ్గుబియ్యం కలిపి చేస్తారు.
అటుకుల బతుకమ్మ: రెండవ రోజు అటుకులను బెల్లం, పాలతో కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.
ముద్దపప్పు బతుకమ్మ: మూడవ రోజు ముద్దపప్పుతో పాటు, అటుకులతో కలిపి ప్రసాదం చేస్తారు.
నానే బియ్యం బతుకమ్మ: నాల్గవ రోజు నానబెట్టిన బియ్యం, బెల్లం, పాలు కలిపి నైవేద్యం పెడతారు.
అట్ల బతుకమ్మ: ఐదవ రోజు అమ్మవారికి నైవేద్యంగా అట్లు చేస్తారు.అలిగిన బతుకమ్మ: ఆరవ రోజు అమ్మవారు అలిగారని నమ్ముతారు. అందుకే ఈ రోజు ప్రత్యేక నైవేద్యం ఉండదు, సాధారణంగా బతుకమ్మ ఆడరు.వేపకాయల బతుకమ్మ: ఏడవ రోజు బియ్యం పిండిని వేపకాయల ఆకారంలో చేసి నైవేద్యం సమర్పిస్తారు.
వెన్న ముద్దల బతుకమ్మ: ఎనిమిదవ రోజు నువ్వులు, వెన్న కలిపి ముద్దలు చేసి అమ్మవారికి నివేదిస్తారు.సద్దుల బతుకమ్మ: పండుగలో చివరిది, అత్యంత వైభవంగా తొమ్మిదో రోజు  ఐదు రకాల సద్దులు (అంటే ఐదు రకాల వంటకాలు) చేసి అమ్మవారికి సమర్పిస్తారు. సద్దులంటే పులిహోర, నువ్వులు, కొబ్బరి, పల్లీలు, బెల్లం కలిపిన వంటకాలు. ఈ రోజు మహిళలందరూ కొత్త చీరలు ధరించి, బతుకమ్మలను అందంగా అలంకరించి, వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతారు. అనంతరం బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల వేడుకలు తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -