కోతకు గురైన బోరిగాం రోడ్డు..
నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన కేంద్రమైన ముధోల్ తోపాటు ఆయా గ్రామాలలో శనివారం రాత్రి ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. అలాగే పంటచేళ్లలో భారీగా వర్షం నీరు చెరింది. దీంతో చేతికొచ్చే సోయపంట వర్షం కారణంగా నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఆదివారం వేకువ జామున బోరిగాం గ్రామాల మధ్య గల లో లేవల్ వంతెన పై నుండివర్షం నీరు అధికంగా ప్రవహించడంతో లో లెవెల్ వంతెన వద్ద రోడ్డు కోతకు గురైంది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈవిషయం తెలుసుకున్న ఆర్ఐ నారాయణ పటేల్ సంఘటన స్థలాన్ని ఆదివారం పరీశీలించారు. ఈ విషయాన్ని సంబంధింత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే జేసిపితో కోతకు గురైన రోడ్డుకు తాత్కాలికంగా మరమ్మత్తులు చెయించారు. ప్రస్తుతం రాకపోకలు యదావిధిగా కొనసాగుతున్నాయి.
ముధోల్ లో భారీ వర్షం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES