Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కౌలాస్ నానా ప్రాజెక్టుకు స్వల్ప నీటి ఇన్ ఫ్లో..

కౌలాస్ నానా ప్రాజెక్టుకు స్వల్ప నీటి ఇన్ ఫ్లో..

- Advertisement -

– ఒక గేటు ద్వారా నీరు విడుదల..
నవతెలంగాణ – జుక్కల్ 

మండలంలోని సవర్గావ్ గ్రామం పరిధిలో నిర్మించి ఉన్న కౌలాస్ నాళా ప్రాజెక్ట్ లోకి శనివారం నాడు కుర్షిన వర్షానికి స్వల్పంగా ఇన్ ఫ్లో నీరు వచ్చి చేరింది. ప్రాజెక్ట్ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం ఆదివారం ఉదయం 6 గంటల సమయం నాటికి పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు కాగా ప్రస్తుతం 457.94 మీటర్లు వద్ద నీరు నిలిచి ఉంది. కెపాసిటీ 1.237 క్యూసెక్కులు ఉంది. ఇన్ ఫ్లో 802 క్యూసెక్కులు వచ్చి చేరింది. అయితే ఆదివారం ఉదయం నాటికి ఒక గేటు ఓపెన్ చేసి వరదగేటు ద్వారా నీటిని దిగవకు 843 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రధాన కాలువ ద్వారా వంద క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాడు. మొత్తం 943 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలివేయడం జరిగిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -