నవతెలంగాణ – ఆర్మూర్
స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమ నేత, స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 13 వ వర్థంతి సందర్బంగా పట్టణంలోని చేనేత కాలనీ చౌరస్తా వద్ద గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఐదవ తర్ప, పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వర్థంతి కార్యక్రమం నిర్వహించినారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, పీసీసీ మాజీ కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది ఖాందేష్ శ్రీనివాస్ , ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ తదితరులు బాపూజీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
నియోజకవర్గ, మండల, పట్టణ వివిధ తర్పల పద్మశాలి సంఘం ప్రతినిథులు బాపూజీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో, తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమాలలో పాల్గొని బాపూజీ చేసిన పోరాటాల గురించి, ఆయన నిర్వహించిన ఉద్యమ స్ఫూర్తి గురించి, బాపూజీ చేసిన త్యాగాల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పద్మశాలి సంఘం ఇంచార్జ్ దాసరి సునీల్, పట్టణ పద్మశాలి సంఘం అద్యక్షులు మోహన్ దాస్ మాట్లాడుతూ.. బాపుజీ ని స్ఫూర్తిగా తీసుకుని పద్మశాలిలు రాజకీయముగా ఎదగాలని, సేవ కార్యక్రమములలో ముందుండాలని కోరారు.
మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు సంగీతా ఖాందేష్, గుద్దేటి రమేష్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు బొడ్డు గంగాధర్, ఐదవ తర్ప అధ్యక్షులు సైబసుధాకర్, సంఘం ప్రతినిథులు అంబల్ల శ్రీనివాస్, జిందమ్ నరహరి, నూకల శేఖర్, ఆడెపు ప్రభాకర్, చౌకే లింగం, కట్కమ్ నరేందర్, కొక్కుల విద్యాసాగర్, బత్తుల భాస్కర్, 8తర్పల అద్యక్షులు నూకల నారాయణ, బండి అనంతరావు, చిట్ల యజ్ఞేశ్, రుద్ర రాజేశ్వర్, వెముల ప్రకాష్, సదమస్థుల గణపతి, అంబల్ల తిరుపతి, గెంట్యాల గణేష్, లింగం, రమణ అన్ని తర్ప సంఘాల అధ్యక్షులు మొదలగు వారు విచ్చేసి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఖాందేష్ సత్యం, అజ్జు, శరత్, పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు, చేనేత కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్, అన్ని తర్పల కార్యవర్గ సభ్యులు, పట్టణ పద్మశాలి సంఘం కులబాంధవులు, వందేమాతరం యూత్ సభ్యులు గోక శరత్,అక్షయ్, భాను, విష్ణు, గిరీష్, కాలనీ వాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.