ప్రముఖుల అభినందనలు
నవతెలంగాణ – ఆలేరు
రసాయన శాస్త్రంలో ఆలేరు పట్టణానికి చెందిన డాక్టర్ ఎలగందుల శివ కుమార్ పీహెచ్డీ పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకున్న సందర్భంగా ఆదివారం స్థానిక మార్కండేయ వద్ద ఆలేరు మాజీ సర్పంచ్ చింతకింది మురళి అభినందించారు. జనం టీవీ ఎడిటర్ దాసి శంకర్ మాట్లాడుతూ.. ఆసూయంత్రం మొదటి కనుగొన్న యేలగందుల సత్యనారాయణ కుమారుడు తల్లిదండ్రులు కోల్పోయినప్పటికీ నిరుత్సాహం చెందకుండా చేనేత వృత్తిని కొనసాగిస్తూ పట్టుదలతో తన అన్న దయాకర్ తమ్ముడు భాను ప్రకాష్ ప్రోత్సాహంతో పట్టుదలతో చదివి డాక్టరేట్ పొంది తల్లిదండ్రులకు పేరుతెచ్చాడని కొనియాడారు.
రసాయన శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ సాధించిన శుభసందర్భంలో పద్మశాలి కుల బాంధవుల సమక్షంలో శ్రీ మార్కండేయ దేవాలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎలగందుల శివకుమార్ మరియు ఎలగందుల దయాకర్ ను సన్మానించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో చింతకింది మురళి,యంబ నరసింహులు, చింతకింది రామాంజం,గుజ్జ అశోక్ ,రేగోటి వెంకటేష్ ,చింత కింది సిద్ధులు, చింతకింది సిద్దేశ్వర్,కాముని రవి కాముని దత్తు, రేగోటి వెంకటేష్ చిట్టి మిల్ల కృష్ణ, భేతి వెంకటేష్ ,బేతి నాగరాజు, భేతి ఆంజనేయులు, చింతకింది గిరిప్రసాద్, భేతి చంద్రశేఖర్,గుజ్జ మణి, సామల సంతోష్ ,ఎలగందుల సత్యనారాయణ ,పాల్గొన్నారు.
ఆలేరు పట్టణ వాసి శివకుమార్ కు డాక్టరేట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES