- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్: నాగిరెడ్డిపేట్ మండలంలోని తాండూర్ గ్రామంలో గల త్రిలింగ రామేశ్వర ఆలయంలో సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయం చాలా మహిమ కలిగినదని మంజీరా తీరంలో వెలిసిన ఈ పుణ్యక్షేత్రం దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన వెంట ఆలయ పూజారి మల్లికార్జునప్ప, కమిటీ అధ్యక్షులు కొమ్మ దత్తు, సభ్యులు హనుమంత్ రెడ్డి, కృష్ణ స్వామి, దామోదర్ రెడ్డి, రమేష్,పి. రాములు,సిడిసి డైరెక్టర్ పీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -