నవతెలంగాణ – కంఠేశ్వర్
డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం అంకాపూర్ లో ఆదివారం నిర్వహించారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలకు స్వయంగా కంటి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. కంటి విషయంలో ఏవైనా సమస్యలుంటే వైద్యుల సూచనల మేరకే మందులు, ఐ డ్రాప్స్ ను వాడాలని ఊరికే వాడి సమస్యలను కొని తెచ్చుకోవద్దన్నారు.
తమ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సుమారు అంకాపూర్ లోని 300 మంది ప్రజలు సద్వినియోగం చేసుకున్నారన్నారు. అదేవిధంగా వైద్య శిబిరం సద్వినియోగం చేసుకున్న ప్రజలందరికీ ఉచితంగా మందులు, కంటి అద్దాలు, కంటి డ్రాప్స్ ను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీడిసి సభ్యులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.