నవతెలంగాణ – ముధోల్
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిణ్వట్ తాలూకా మదనాపూర్ కు చెందిన గంగేశ్వర్ మహరాజ్ పాదయాత్ర ఆదివారం ముధోల్ కు చేరుకుంది. దీంతో పాదయాత్ర బృందానికి బంజారా సంఘం జిల్లా నాయకులు నరెందర్ రాథోడ్ , బిజేపి నాయకులు నర్సగౌడ్, విశ్వనాథ్ పటేల్, భక్తులు, తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ పాదయాత్ర కుబీర్ మండలం గాల్ సింగ్ నాయక్ తాం డ లోని జగదాంబ ఆలయం నుండి సేవలాల్ మహారాజ్ పాదుకపల్లకితో బాసర్ వరకు ఈ పాదయాత్రచేపట్టినట్లు వారు తెలిపారు. ఆదివారం రాత్రి ముధోల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బస చేసి సోమవారంఈ పాదయాత్ర బాసర కు చేరుకుంటుందని వారు తెలిపారు.బాసర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకొనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం గోదావరి నది జలాలను గాలిసింగ్ నాయక్ తండా లోని జగదంబా ఆలయానికి తీసుకెళ్లి దేవి నవరాత్రులలో భాగంగా ఘటాలను ప్రతిష్టించనున్నట్లు నిర్వాహకులు చెప్పారు.
ముధోల్ కుచేరిన గంగేశ్వర్ మహారాజ్ పాదయాత్ర..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES