గుజ్జర్లపూడి సూర్యప్రకాష్ రావు
ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – నెల్లికుదురు
నేటి సమాజంలో నిస్వార్ధ సేవకులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లని కొడకండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకుడు గుజ్జర్లపుడి సూర్య ప్రకాష్ రావు నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అరగకుటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం రామన్నగూడెంలో నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం రెండో రోజున సమావేశానికి గ్రామ ప్రముఖుడు కాసం లక్ష్మారెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నేటి సమాజంలో సొంత లాభాన్ని కొంత మానుకొని పొరుగు వానికి సేవ చేయాలనే దృక్పథంతో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు నిస్వార్థ సేవకులుగా ఎదిగారని అన్నారు. సేవ చేయడంలో ఉన్న తృప్తి మరే రంగంలో లభించదని అది ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల గొప్పతనమని అన్నారు. అలాగే ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు నేటి పోటీ ప్రపంచంలో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని మంచి నాయకత్వాన్ని దేశానికి అందించాలని సూచించారు. రెండో రోజు క్యాంపులో వాలంటీర్లు ఉదయం 6 గంటల నుండి 6:30 వ్యాయామం చేశారు. అనంతరం స్కూలు ఆవరణలోని పిచ్చి మొక్కలను, ముళ్ళ పొదలను తొలగించి శుభ్ర పరిచారు. విద్యార్థులు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి, ప్రజలలో అవగాహన కల్పించాలని వాలంటీర్లను కోరారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు జేమ్స్, సాయికుమార్, చందు సురేష్, నరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
నిస్వార్ధ సేవకులు ఎన్ఎస్ఎస్ వాలంటీరులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES