నవతెలంగాణ – మాక్లూర్
ఆలూరు మండలంలోని కల్లెడ జడ్పిహెచ్ఎస్ విద్యార్థులు ఆలూరు మండల అంతర పాఠశాలల క్రీడోత్సవాలలో ఓవరాల్ ఛాంపియన్స్ గా గెలుపొందడంతో విద్యార్థులను అభినందించి, ర్యాలీ ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 16, 17, 18 తేదీలలో ఆలూరు పాఠశాలలో నిర్వహించినటువంటి 69వ ఈ జి టి ఆలూరు మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాలలో జడ్.పి.హెచ్.ఎస్. కల్లెడ విద్యార్థులు వివిధ క్రీడాంశాలలో అత్యున్నత ప్రతిభ కనబర్చారని వారిని ఆబినందించారు.
మార్చ్ పాస్ట్ లో 2వ స్థానము, 2), జూనియర్ గర్ల్స్ కబడ్డీలో మొదటి స్థానము, 3) సబ్ జూనియర్ బాయ్స్ వాలీబాల్ లో మొదటి స్థానము, 4) సబ్ జూనియర్ బాయ్స్ ఖో ఖో లో మొదటి స్థానము, 5)జూనియర్ గర్ల్స్ ఖో ఖో లో రెండవ స్థానము, 6)జూనియర్ గర్ల్స్ వాలీబాల్ లో రెండవ స్థానము, 7)జూనియర్ బాయ్స్ కబడ్డీలో రెండవ స్థానము, 8)సబ్ జూనియర్ బాయ్స్ కబడ్డీలో రెండవ స్థానము, 9) సబ్ జూనియర్ గర్ల్స్ కబడ్డీలో రెండవ స్థానము, సబ్ జూనియర్ గర్ల్స్ ఖో ఖో లో రెండవ స్థానము, జూనియర్ బాయ్స్ షాట్ పుట్ విభాగంలో హరి కుమార్ 2వ స్థానము గెలుపొందరాన్నారు. ఈ టోర్నమెంట్ మొత్తంలో అత్యధిక బహుమతులు గెలుపొంది ఓవరాల్ ఛాంపియన్షిప్ గా కల్లెడ పాఠశాల, ఆలూరు మండల అంతర పాఠశాల క్రీడోత్సవాలలో వరుసగా రెండవసారి ఓవరాల్ ఛాంపియన్స్ గా నిలవడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు ఎస్. ఆర్. నాగరాజు తెలియజేయడం జరిగింది.
ఆలూరు మండల స్థాయి అంతర్ పాఠశాల క్రీడోత్సవాలలో జడ్పీహెచ్ఎస్ కల్లాడ విద్యార్థులు సాధించిన విజయాలకు గాను, వివిధ క్రీడాంశాలలో పాల్గొన్న క్రీడాకారులను, అందుకు ప్రోత్సహించినటువంటి కల్లెడ పాఠశాల పిడి పింజ సురేందర్ ను పాఠశాల ఆవరణంలో అభినందన సభ ఏర్పాటు చేసి అభినందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, గ్రామ ప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు, క్రీడాకారులను అభినందిచారు. గ్రామంలో గెలుపొందిన బహుమతులతో విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, లింగయ్య, పవన్ కుమార్, అరుణోదయ, సురేఖ, సునీత, సాగర్, నాగభూషణం, సునీల్ రావు, గీతా, శ్రీ వేణి, గ్రామస్తులు, గ్రామ ప్రతినిధులు, యువజన సంఘ నాయకులు పాల్గొన్నారు.
క్రిడోత్సవల్లో ఓవరాల్ ఛాంపియన్స్ విద్యార్థులకు అభినందన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES