నవతెలంగాణ-కోహెడ
మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాలలో అనుమానస్పదంగా ఎవరైన కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై అభిలాష్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా పోలీస్ కమీషనర్ డాక్టర్ బి.అనురాధ ఆదేశాల మేరకు ముందస్తు జాగ్రత్తలు పగడ్బందిగా తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దసరా, బతుకమ్మ సెలవులతో స్కూల్స్, కళాశాలలకు సెలవులు రావడంతో తమ పిల్లలతో స్వంత గ్రామాలకు ప్రయాణాలు చేస్తుంటారని ఇదే అదనుగా దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తుంటారన్నారు.
ఇతర గ్రామాలకు వెళ్ళేవారు ఇంటి బయట, ఇంటి లోపల ఒక లైటు వేసి ఉంచాలన్నారు. విలువైన వస్తువులను, సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదని సూచించారు. ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిదన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. అలాగే ఆఫర్‌ల వలలోపడి మోసపోవద్దని, సైబర్ నేరాలపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈకేవైసీ, ఏపీకే లాంటి ఆఫ్ లింక్‌లను ఓపెన్ చెస్తే మీ ఫోన్ హ్యాక్ అవుతుందని అలాంటివి జరిగినట్లు గమనిస్తే వెంటనే 1930కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు.
అనుమానస్పదంగా కనిపిస్తే సమాచారం ఇవ్వాలి: ఎస్సై
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES