- Advertisement -
తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
పూలను పూజించి ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకని తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం మండల ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరూ కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బతుకమ్మ పండుగ స్త్రీ శక్తిని ప్రతిబింబించే పండుగగా నిలుస్తుందని తెలిపారు. బతుకమ్మల నిమ్మజ్జనంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మండలంలో ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో, సోదరభావంతో బతుకమ్మ పండుగను దిగ్విజయంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
- Advertisement -