Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైద్య శిబిరానికి విశేష స్పందన..

వైద్య శిబిరానికి విశేష స్పందన..

- Advertisement -

అనసూయమ్మ ట్రస్ట్ డైరెక్టర్ బండ శ్రీకాంత
నవతెలంగాణ – మల్హర్ రావు

చంద్రుపట్ల అనసూయమ్మ చారిటెబుల్ ట్రస్ట్ ఛైర్మెన్ చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రమైన తాడిచెర్లలో ఆదివారం రెనీ హాస్పిటల్ మంథని, రుద్ర, సత్యం బాబు పిల్లల హాస్పిటల్ గోదావరిఖని లచే ఉచితంగా నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చిందని ట్రస్ట్ డైరెక్టర్ బండ శ్రీకాంత్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు సత్యంబాబు, వి.లక్ష్మీలు తాడిచెర్లతోపాటు వివిధ గ్రామాల నుంచి దాదాపు 500 మంది రోగులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఉచిత సేవలందించిన వైద్యులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్కా మోహన్ రావు, సమ్మయ్య, నిసాన్,శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్, సంజీవ్, రంజిత్, అశోక్, విజయ్ కుమార్, శెరాలు, రాజమల్లు, శేషు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -