Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు 
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సీమ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బస్సు యాత్రలో భాగంగా ఆదివారం ఆత్మకూరు మండల కేంద్రం లో ఉద్యమకారులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ..అప్పటి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీల డిమాండ్ సాధనకై పోరాడుదాం. 

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మెనీపేస్టోలో పెట్టిన దాన్ని ప్రెస్ మీట్ లో ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలము, నెలకు రూపాయలు 25వేల పెన్షన్ అందజేస్తామని హామీ ఇచ్చారు . అధికారంలోకి రాగానే కాంగ్రెస్ తమ ఎన్నికల హామీలను విశ్వసించడమే కాకుండా తెలంగాణ ఉద్యమకారులకు యోగక్షేమాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఉద్యమకారులో తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది. ఈ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయడం కోసం తెలంగాణ ఉద్యమకారుల పోరమ్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు మార్లు మెమోరాండం లు సమర్పించడం జరిగింది.

 ప్రతి జిల్లాలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయినా ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేకపోవడంతో ఉద్యమకారులు మరింత బలంగా తమ హక్కుల కోసం పోరాడే నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 21 2025 ఆదివారం బస్సు యాత్రలో భాగంగా 584 మండలాలు తిరుగుటకు నిర్ణయించినట్లు తెలిపారు. ఉద్యమకారుల దీన పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుర్తించి తమకు అన్ని విధాల న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకాలను ఏకం చేసి మరో ఉద్యమానికి నాంది పలుకుతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాయరాకుల రవీందర్ తెలంగాణ ఉద్యమకారులు ఆత్మకూరు మాజీ సర్పంచ్ నాగేలు సామెల్, జల్లెల రాజు, జిల్లపెళ్లి చిన్న సారయ్య, వంగేటి ప్రభాకర్, లక్కర్సు లింగమూర్తి , దుప్పటి శంకర్,తోట గణపతి, నాగేల్లి స్వామి, జన్నారపు బిక్షపతి, పులి చేరి పైడి, ,పెరుమళ్ళ స్వామి తనుగుల ప్రభాకర్ తనుగుల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -